మంచిర్యాల శ్రీ చైతన్య స్కూల్ లక్ష్మీనగర్ బ్రాంచిలో బుధవారం ముందస్తు దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. మతాలకు అతీతంగా విద్యార్థులంతా పాల్గొని టపాకాయలు కాల్చారు. తెలుగు ఉపాధ్యాయురాలు ఎలిజబెత్ రాణి తన సందేశంలో పండుగ ప్రాముఖ్యతను పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అయూబ్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అరవింద్, కోఆర్డినేటర్లు నాగరాజు, జయశ్రీ, రోజారాణి, తదితరులు పాల్గొన్నారు.