మంచిర్యాల: బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

80చూసినవారు
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి కోరుతూ నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం మంచిర్యాలలో సమగ్ర కులగణనపై జరిగిన సమావేశంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం సమితి నాయకులు గుమ్ముల శ్రీనివాస్, అక్కల రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి రాబోయే ఐదేళ్లకు లక్ష కోట్లు కేటాయించాలని కోరారు.

సంబంధిత పోస్ట్