మందమర్రిలో కార్పొరేట్ స్థాయిలో జరిగిన స్ట్రక్చరల్ సమావేశంలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై చర్చించడంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ సవతి తల్లి ప్రేమ చూపించిందని సీఐటీయూ అనుబంధ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం అధ్యక్షుడు దూలం శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ కోలిండియా వేతనాలు, ఇతర సౌకర్యాలు, ఖాళీ క్వార్టర్ల కేటాయింపు, 7వ తేదీన వేతనాల చెల్లింపుపై మాట్లాడిన పాపాన పోలేదని ఆరోపించారు.