తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొట్టమొదటిసారి మందమర్రి పట్టణానికి విచ్చేసిన డా. వివేక్ వెంకటస్వామికి శనివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహభరితంగా ఘన స్వాగతం పలికారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ ప్రీతిని, అభిమానం వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులు, మైనింగ్ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు.