హైదరాబాద్‌లో తన నివాసంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ను పలువురు నాయకులు కలిశారు. హైదరాబాదుకు బెల్లంపల్లి నుంచి సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేయాలని, రైల్వే థర్డ్ లైన్ నిర్మాణం వల్ల రైళ్లు మంచిర్యాల వరకు మాత్రమే నడుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ఆర్టీసీ డీఎంను ఫోన్‌లో సంప్రదించి చర్యలు చేపట్టారు.