
తల్లికి వందనం.. వారి అకౌంట్లోనూ రూ.13 వేలు
AP: కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లుల జాబితాను మరోసారి పరిశీలించనున్నట్లు తెలిపింది. అనంతరం తల్లికి వందనం నగదు రూ.13 వేల చొప్పున అకౌంట్లోకి జమ చేస్తామని పేర్కొంది. ఎంత మంది పిల్లలుంటే అంతమందికి పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. తల్లికి వందనం నగదు జమ కాని వారు గ్రామ, వార్డు సచివాలయాల వద్ద దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.