నస్పూర్ నుంచి కాగజ్ నగర్ వైపు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, ఎస్సై ఉపేందర్ లు బుధవారం తెలిపారు. బియ్యం సుమారు 70 క్వింటాళ్లు ఉంటాయని పేర్కొన్నారు. తరలిస్తున్న పాస్తం రాములు, బియ్యాన్ని, డీసీఎం వ్యాను ను తదుపరి విచారణ నిమిత్తం నస్పూర్ పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు.