నల్గొండ జిల్లాలో ఎంపీడీవో, ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను అక్కడి కలెక్టర్ సస్పెండ్ చేయడం పై నిరసన వ్యక్తం చేస్తూ జన్నారం మండలంలోని వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఎంపీడీవో, కార్యదర్శిలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కార్యదర్శుల సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గురువారం కోరారు.