మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్ సబ్ స్టేషన్ పరిధిలో మరమతుల కారణంగా శనివారం ఉదయం 9: 30 నుంచి 11: 30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏడిఈ వేణుగోపాల్ తెలిపారు. హమాలివాడ, సూర్య నగర్, భగత్ నగర్, అర్కలవాడ, సప్తగిరి కాలనీ, వేముల బస్తి, రాజీవ్ నగర్, 100 ఫీట్ల రోడ్డు, తెలంగాణ నగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేనినట్లు పేర్కొన్నారు.