లక్షెట్టిపేట: నిరుపేదల సంక్షేమానికి ప్రాధాన్యత

309చూసినవారు
లక్షెట్టిపేట: నిరుపేదల సంక్షేమానికి ప్రాధాన్యత
నిరుపేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ లక్షెట్టిపేట పట్టణ నాయకులు అన్నారు. ఆదివారం లక్షెట్టిపేట పట్టణంలోని ఊట్కూర్ 9 వ వార్డులో ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇంటిని నిర్మించి ఇవ్వడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్