ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మోకాళ్లపై నిల్చోని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు చట్టసభలలో 14 శాతం ప్రాతినిధ్యం కూడా లేదన్నారు.