శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా TBGKS వైస్ ప్రెసిడెంట్గా బండి రమేశ్ నియమితులయ్యారు. ఆదివారం శ్రీరాంపూర్ ఏరియా ముఖ్య కార్య కర్తల సమావేశం నిర్వహించారు. యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రాజిరెడ్డి, సురేందర్ రెడ్డి రమేశ్కు నియామకపత్రం అందజేశారు. కార్మికుల హక్కులు, వారి సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. యూనియన్ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.