జన్నారం అటవీ శాఖ ఎఫ్డిఓగా రామ్మోహన్

65చూసినవారు
జన్నారం అటవీ శాఖ ఎఫ్డిఓగా రామ్మోహన్
జన్నారం అటవీ శాఖ ఎఫ్డిఓగా ఎం. రామ్మోహన్ నియమితులయ్యారు. ఈ మేరకు అటవీ శాఖ ఉన్నతాధికారులు శనివారం ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాదులోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో రామ్మోహన్ సీనియర్ రేంజ్ ఆఫీసర్గా, కోర్సు డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ప్రభుత్వం పదిమంది సీనియర్ రేంజ్ అధికారులకు ఎఫ్డిఓలుగా పదోన్నతులు కల్పించింది. అందులో రామ్మోహన్ కూడా పదోన్నతి పొంది జన్నారం ఎఫ్డిఓగా రానున్నారని స్థానిక అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్