మంచిర్యాల జిల్లాలో వేసవి సెలవుల అనంతరం గురువారం నుంచి స్కూళ్లు పున: ప్రారంభం కానున్నాయి. జూన్ 11 వరకు సెలవులు ఇవ్వడంతో ప్రభుత్వ, స్కూళ్లు రేపటి నుంచి తెరుచుకోనున్నాయి. అటు ప్రాథమిక స్కూళ్లు ఉ. 9 నుంచి సా. 4గంటల వరకు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉ. 9 నుంచి సా. 4. 15 గంటల వరకు నడుస్తాయని విద్యాశాఖ తెలిపింది.