అంబేద్కర్ జయంతిని వాడవాడల జరపాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి అన్నారు. శ్రీరాంపూర్ లో ఆయన మాట్లాడుతూ రేపటి నుండి ఈ నెల 25 వరకు జయంతి వేడుకలు అన్ని గ్రామాల్లో నిర్వహించాలన్నారు. ఆదివారం సాయంత్రం జిల్లాలోని అన్ని మండలాల్లో అంబేద్కర్ విగ్రహాల శుద్ది కార్యక్రమం జరపనున్నట్లు పేర్కొన్నారు. నస్పూర్ లో అంబేద్కర్ విగ్రహానికి సిర్పూర్ ఎంఎల్ఏ పాల్వాయి హరీష్ బాబు పాలతో శుద్ధి చేసారన్నారు.