శ్రీరాంపూర్: ప్రమాదం కేసులో ఒకరికి 18 నెలల జైలు

75చూసినవారు
శ్రీరాంపూర్: ప్రమాదం కేసులో ఒకరికి 18 నెలల జైలు
శ్రీరాంపూర్ పీఎస్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆవిడపు సంతోష్ కుమార్ కు 18 నెలల జైలు శిక్షతో పాటు 8 వేల జరిమానా విధించిందని ఎస్సై మంగళవారం తెలిపారు. పోతనవేణి మల్లమ్మ 2017 నవంబర్ 6న చెన్నూరు నుంచి ఆర్టీసీ బస్సులో వచ్చి శ్రీరాంపూర్ లో దిగింది. రోడ్డు దాటుతుండగా మల్ల మ్మను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆమె రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

సంబంధిత పోస్ట్