శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 6 కొత్త రోడ్ ప్రజాసేవ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్బంగా అసోసియేషన్ నూతన కార్యవర్గానికి నిర్వహించిన ఎన్నికల్లో చిలుక మల్లేష్ బలపరిచిన కుమ్మరి రాజ్ కుమార్ అధ్యక్షుడిగా గెలిచారు. అలాగే న్యాయ సలహాదారుడిగా రొడ్డ నాగార్జునను ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.