44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా మార్చి అమలుపరిచే విధానాన్ని వ్యతిరేకిస్తూ మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహ రావు, అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీరాంపూర్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బీజేపీ ఆలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.