నేడు మంచిర్యాలకు సీతక్క రాక
తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తో కలిసి చెన్నూర్ నియోజకవర్గం లోని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.