మంచిర్యాల జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల్లో నాలుగేళ్ల సర్వీస్ నిండిన ఉద్యోగులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల జిల్లా పరిషత్ కార్యాలయంలో పని చేస్తున్న కొంత మంది సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. అలాగే మిగతా మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇక్కడికి బదిలీ చేశారు.