ఉట్నూర్: ప్రజా సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత

54చూసినవారు
ఉట్నూర్: ప్రజా సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత
ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క అన్నారు. ఆదివారం ఉట్నూర్ మండలంలోని కొత్తగూడ అనుబంధ మారుగూడా గ్రామంలో రైతులతో కలిసి ఆమె డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ను కట్ చేసి డిప్యూటీ సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్