పోలీసులపై ప్రజలకు నమ్మకం కల్పించేలా పనిచేయాలి

75చూసినవారు
పోలీసులపై ప్రజలకు నమ్మకం కల్పించేలా పనిచేయాలి
పోలీసులపై ప్రజలకు నమ్మకం, భరోసా కల్పించేలా ప్రతి ఒక్కరు విదులు నిర్వర్తించాలని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ పేర్కొన్నారు. మంగళవారం జోన్ పరిధిలోని అధికారులతో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ విచారణలోని కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, సమగ్ర విచారణతో ప్రతి నిందితుడికి శిక్ష పడేలా పోలీసు అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. బ్లూకోల్ట్, పెట్రోలింగ్ సిబ్బంది నిరంతరం ప్రజల మధ్య ఉండాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్