సింగరేణిలో ఇటీవల ప్రకటించిన లాభాల్లో వాటాపై కొన్ని సంఘాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కార్మికులు నమ్మవద్దని గుర్తింపు సంఘం ఏఐటియుసి అద్యక్షులు సీతారామయ్య కోరారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉండి కార్మికులకు ఏమీ చేయని బీఆర్ఎస్, టిబిజికేఎస్ ఉనికి కోసం కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. కార్మికుల హక్కుల రక్షణ, సంస్థ మనుగడ కోసం ఏఐటియుసి పోరాడుతుందన్నారు.