నటుడు మంచు మనోజ్ ఆదివారం జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ ను కలిశారు. నారా లోకేష్ సోమవారం కుటుంబంతో కలిసి కుంభమేళాకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న విషయం తెలియడంతో మంచు మనోజ్ వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.