‘రైతుబంధు’ డబ్బులను తిరిగి చెల్లించాలని ఆదేశం!

63చూసినవారు
‘రైతుబంధు’ డబ్బులను తిరిగి చెల్లించాలని ఆదేశం!
‘రైతుబంధు’ ద్వారా పొందిన రూ.16 లక్షలను తిరిగి చెల్లించాలని మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్- పోచారంలోని ఎం.యాదగిరిరెడ్డికి నోటీసులు అందాయి. ఆయన తన 33 ఎకరాల వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయించినప్పటికీ రైతుబంధు పొందారు. మండలంలో 30 వేల ఫార్మ్ ల్యాండ్ ఉంటే 66 వేల ఎకరాలకు చెల్లించినట్లు జిల్లా కలెక్టర్ గుర్తించారు. ఆయన ఆదేశాలతో రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించి అధికారులు యాదగిరికి నోటీసులిచ్చారు. దీంతో అనర్హుల నుంచి రైతుబంధు నగదు రికవరీ చేయాలని డిమాండ్ లు వినిపిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్