TG: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద మామిడికాయలతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించారు. ఇక మామిడి పండ్లు కిందపడిపోవడంతో అటుగా వెళ్తున్న వారు పండ్ల కోసం ఎగబడ్డారు. ట్రేలతో సహా తీసుకుని వెళ్లారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపడుతున్నారు.