మామిడి పండ్లను తింటే ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మామిడి పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇంకా మలబద్ధకం సమస్యను అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా మామిడి పండ్లలో ఉండే మాంగిఫెరిన్ అనే యాంటీఆక్సిడెంట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. గుండె సమస్యను నివారిస్తుంది.