మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో మన్మోహన్ సింగ్ కు ఎంపీ నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ మరణం దేశ ప్రజలకు తీర్చలేని లోటు అని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ అంటేనే సంస్కరణలకు పెట్టింది పేరు అని కొనియాడారు. భారతజాతి గర్వించదగ్గ మహనీయుడు మన్మోహన్ సింగ్ అని పేర్కొన్నారు.