BREAKING: ఫైనల్‌కు దూసుకెళ్లిన మను బాకర్‌

1911చూసినవారు
BREAKING: ఫైనల్‌కు దూసుకెళ్లిన మను బాకర్‌
ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత యువ షూటర్‌ మను బాకర్‌ మరో విభాగంలోనూ ఫైనల్‌కు దూసుకెళ్లింది. షూటింగ్‌ మహిళల 25 మీటర్ల పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ పోరులో టాప్‌ 2లో నిలిచి తుది పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన క్వాలిఫికేషన్‌లో తొలుత ప్రిసిషన్‌ రౌండ్‌లో 294 పాయింట్లు సాధించి టాప్‌ 3లో నిలిచింది. ర్యాపిడ్‌ తొలి సిరీస్‌లో ఏకంగా 100 పాయింట్లు సాధించింది. శనివారం ఫైనల్‌ పోరు జరగనుంది.

సంబంధిత పోస్ట్