లవంగం టీ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు మన దరిచేరవు. ముఖ్యంగా అల్సర్ వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. కడుపులో అల్సర్ సమస్యలు రాకుండా నివారిస్తుంది. మంచి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. లవంగం టీ తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే లవంగంలో ఫైబర్ ఉంటుంది. ఇది లివర్ సిర్రోసిస్ ఆక్సిడేటీవ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది. లవంగంలో ఉండే సెల్స్ కాలేయ ఆరోగ్యాన్ని మెరుగు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.