అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విదేశాంగ శాఖ స్పందించింది. 'అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న ఘటన మాటలకందని పెను విషాదం. ఇప్పటి వరకు ఉన్న అప్‌డేట్ ప్రకారం ఇందులో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మృతుల్లో ఎక్కువ మంది విదేశీయులు ఉన్నారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి' అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు.