ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం ఈ దాడుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే ఝార్ఖండ్‌లోని చాయిబాసాలో మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి పోలీసు అధికారి మృతి చెందాడు. సీఆర్పీఎఫ్ సిబ్బంది ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.