చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల హింసాత్మక కార్యక్రమాలు 2010 నాటితో పోలిస్తే 47% తగ్గినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వెల్లడించింది. 2024లో మావోయిస్టుల గ్రూపుల హింసాకాండలో పౌరులు, భద్రతా సిబ్బంది మృతుల సంఖ్య కూడా 64% తగ్గినట్లు తెలిపారు. 2024లో వామపక్ష తీవ్రవాదం కేసులు 267 నమోదు అయ్యాయని.. 2010లో ఆ సంఖ్య 499గా ఉన్నట్లు వెల్లడించారు. పౌరులు, భద్రతా దళాల సంఖ్య 2010లో 343 ఉండగా, గతేడాది ఆ సంఖ్య 122కు తగ్గినట్లు తెలిపారు.