రెండు సెల్ టవర్స్ తగలబెట్టిన మావోయిస్టులు

55చూసినవారు
రెండు సెల్ టవర్స్ తగలబెట్టిన మావోయిస్టులు
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్ నారాయణ్ పూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడ్డారు. చోటే‌డోన్‌గార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చమేలి, గౌర్ దండ గ్రామాల్లో రెండు మొబైల్ సెల్ టవర్‌లను మావోయిస్టులు తగలపెట్టారు. ఆదివారం బంద్ సందర్భంగా బీజాపూర్ జిల్లాలో రెండు సెల్ టవర్స్ తగలపెట్టగా, సోమవారం నారాయణపూర్ జిల్లాలో మరో రెండు టవర్స్ తగల పెట్టడంతో ఆ ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ నిలిచిపోయింది. అనంతరం మావోలు అక్కడ బ్యానర్లు కట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్