దేశంలోనే మార్గదర్శి అతి పెద్ద స్కామ్: మిథున్ రెడ్డి

77చూసినవారు
దేశంలోనే మార్గదర్శి అతి పెద్ద స్కామ్: మిథున్ రెడ్డి
దేశంలో జరిగిన స్కామ్‌లలో మార్గదర్శి స్కామ్ అతి పెద్దదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లోక్ సభలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంత పెద్ద స్కామ్ జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రూ.2,600 కోట్లు డిపాజిట్లుగా సేకరిస్తే.. ఈడీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్