దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ చివరికి 631 పాయింట్ల లాభంతో 76.532 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 205 పాయింట్ల లాభంతో 23,163 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.86.55 వద్ద స్థిరపడింది. జొమాటో, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ముగిశాయి. మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టపోయాయి.