కట్నంగా కారు ఇవ్వలేదని పెళ్లి రద్దు (వీడియో)

78చూసినవారు
ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో ఓ పెళ్ళిలో షాకింగ్ ఘటన జరిగింది. వరుడు కట్నం కింద క్రిటా కారు ఇవ్వాలని కోరాడు. వధువు తరపున వారు వ్యాగ్నర్‌ను తీసుకొచ్చారు. ఆ తర్వాత అబ్బాయి తరఫు వారు అమ్మాయి తండ్రికి ఫోన్ చేసి కట్నంగా క్రిటా కారు కావాలని చెప్పారు. అప్పుడే పెళ్లి ఊరేగింపుకి వస్తామని.. పెళ్లి రద్దు చేసుకున్నారు. ఇప్పటికే వరుడికి చాలా కట్నం ఇచ్చినట్లు వధువు తరపున వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్