అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య!

80చూసినవారు
అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య!
AP: శ్రీకాకుళం జిల్లాలోని సంతవురిటి గ్రామంలో దారుణం జరిగింది. బాలబోమ్మ భవానీ(21) అనే వివాహిత మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పాలఖండ్యాం గ్రామానికి చెందిన భవానీకి దినేష్‌తో 9 నెలల క్రితం వివాహం జరిగింది. దినేష్‌ సచివాలయ లైన్‌మేన్‌గా చేస్తుంటాడు. కొన్నాళ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం భవానీ సోదరుడికి దినేష్‌ ఫోన్‌ చేసి భవానీ మృతిచెందినట్లు చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్