మారుతీ సుజుకీ తన నెక్సా మోడళ్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. బాలెనో, జిమ్నీ, ఫ్రాంక్స్, ఎక్స్‌ఎల్6, ఇన్విక్టో, గ్రాండ్ విటారా వాహనాలపై నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ ఆఫర్లను కలిపి రూ.1.15 లక్షల వరకు లాభాలు పొందొచ్చు. జిమ్నీ ఆల్ఫా వేరియంట్‌పై రూ.లక్ష రాయితీ ఇవ్వగా, ఇన్విక్టోపై రూ.1.15 లక్షల వరకు ప్రయోజనాలు ఉన్నాయి. తాజా డీల్స్‌తో మారుతీ కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టే.