మార్వెల్ సిరీస్‌తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ నటుడు జులియన్ మెక్ మహన్ (56) కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన.. పరిస్థితి విషమించి శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. మార్వెల్ సిరీస్ 'ఫెంటాస్టిక్ ఫోర్'లో 'డాక్టర్ డూమ్'గా పాపులర్ అయ్యారు. ఆయన మృతిపై హాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.