TG: యాదగిరిగుట్ట మండలంలోని ఓ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్‌క్లూజివ్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన కనకయ్య అనే కార్మికుడు మృతి చెందాడు. మరో ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామానికి చెందిన మొగిలిపాక ప్రకాష్ పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.