బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి

84చూసినవారు
బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
తమిళనాడులోని విరుధునగర్ జిల్లా కరియాపట్టి సమీపంలోని ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. శిథిలాల కింద నలుగురు చిక్కుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది యువరాజ్ బాణసంచా కర్మాగారంలో మంటలు ఆర్పేందుకు వెళ్లారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్