పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఓసీ2 బొగ్గు గనిలో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడుతో నాగేపల్లి, లద్నాపూర్, ఆదివారంపేట, రాజాపూర్, పన్నూరు గ్రామాల్లో భూమి కంపించింది. ఇండ్లపై రాళ్లు పడటంతో కొన్ని ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఘటనపై ఆగ్రహించిన గ్రామస్తులు బ్లాస్టింగ్ పనులను తక్షణమే ఆపాలని, గాయపడినవారికి వైద్యం, నష్టపోయినవారికి పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు.