TG: హైదరాబాద్ పాతబస్తీలోని మహారాజ్‌గంజ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో నుంచి మంటలు ఎగసిపడుతుండగా అందులో సుమారు 10 మంది చిక్కుకున్నట్లు సమాచారం. మరోవైపు ఇంటి పక్కనే ఉన్న ప్లాస్టిక్ గోడౌన్‌కు సైతం మంటలు అంటుకున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.