TG: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలోని పాత MPDO ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలు ఆర్పుతుండగా ఓ డెడ్‌బాడీ ప్రత్యక్షమైంది. డెడ్‌బాడీ పూర్తిగా కాలడంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. అప్పటికే ఆఫీసులో భద్రపర్చిన పాత ఎన్నికల సామాగ్రి, డాక్యూమెంట్స్ మొత్తం పూర్తిగా కాలిపోయాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.