హైదరాబాద్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం సాయంత్రం ఫ్రాంక్లిన్ EV ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దట్టమైన పొగతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
ఎలక్ట్రానిక్ బ్యాటరీలు భారీ శబ్దంతో పేతుతుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.