యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం బొర్రలగూడెంలోని వాంటో సుట్ కేస్ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్‌తో కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది.