భారీ అగ్నిప్రమాదం.. 15కి పైగా గోదాంలు దగ్ధం (వీడియో)

60చూసినవారు
గుజరాత్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. వల్సాద్ జిల్లాకేంద్రంలోని వాపి ఏరా ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున ఒక స్క్రాప్ గోదాంలో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. 10 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో చుట్టుపక్కల ఉన్న 15కి పైగా స్క్రాప్ గోదాంలు కాలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్