పలు కంపెనీలలో లేఆఫ్‌లు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్‌లో మూడు శాతం మందికి లేఆఫ్‌లు ప్రకటించనున్నట్లు సమాచారం. కాగా, 2023లో 10 వేలమందికి ఉద్వాసన పలికిన అనంతరం ఇదే రెండో అతిపెద్ద తొలగింపు కానుంది. గతేడాది జూన్ నాటికి ఆ సంస్థలో 2.28 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. మైక్రోసాఫ్ట్ తాజా నిర్ణయంతో మధ్యస్థ స్థాయి మేనేజ్‌మెంట్ ఉద్యోగులపై అధిక ప్రభావం పడనుందని సమాచారం.