భారీ చోరీ.. 60 తులాల బంగారం అపహరణ

61చూసినవారు
భారీ చోరీ.. 60 తులాల బంగారం అపహరణ
వైఎస్‌ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ చోరీ జరిగింది. బొల్లవరంలో ఉంటున్న చంద్రశేఖర్‌రెడ్డి బంధువుల ఇంట్లో పెళ్లి ఉండడంతో కుటుంబంతో కలిసి కర్నూలు వెళ్లారు. ఈ క్రమంలో దొంగలు ఇంట్లోకి చొరబడి 60 తులాల బంగారం, 3 కిలోల వెండి, రూ.14 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం తిరిగి వచ్చాక చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్